ఏ మాత్రం ఆగని స్టాక్ మార్కెట్లు....!!!

SMTV Desk 2019-09-23 17:57:00  

భారత ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తీసుకున్న నిర్ణయంతో స్టాక్‌ మార్కెట్లలో ఈరోజు కూడా ఉత్సాహం కొనసాగింది. సానుకూల రుతుపవనాలు సైతం వృద్ధి రేటుపై ఆశలు పెంచుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోందని అంటున్నారు. ఫార్మా, ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఎల్‌ అండ్‌ టీ, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, ఓఎన్‌జీసీ, మారుతి సుజుకి షేర్లు భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1075 పాయింట్ల లాభంతో 39,090 పాయింట్ల వద్ద ముగియగా, 329 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,603 పాయింట్ల వద్ద ముగిసింది.