టిఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్న సునీతా లక్ష్మారెడ్డి

SMTV Desk 2019-04-01 16:22:19  sunita lakshmareddy, congress party, trs, ktr

హైదరాబాద్‌, ఏప్రిల్ 1: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ సమక్షంలో సునీతా లక్ష్మారెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్‌. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెదక్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు, పద్మాదేవేందర్‌ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.