శ్రీను వైట్ల ఈ సారైనా?

SMTV Desk 2019-02-20 19:25:20  Srinu Vaitla, Dhee 2

హైదరాబాద్, ఫిబ్రవరి 20: "ఓడలు బళ్లవుతాయి, బళ్లు ఓడలవుతాయి" అన్న సామెత సినిమా వాళ్ళకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. వరుస హిట్స్ తో స్టార్ రేంజ్ లో ఉన్న హీరోలు డైరెక్టర్లు సైతం ఒక్క డిజాస్టర్ సినిమా పడితే కోలుకోలేని స్థితిలోకి వెళుతుంటారు. ఇదంతా ఎందుకు అంటే శ్రీను వైట్ల గురించి ప్రస్తావించాల్సి వచ్చింది కాబట్టి , స్టార్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు తీస్తూ స్టార్ స్టేటస్ అనుభవించిన శ్రీను వైట్ల కెరీర్ ను మహేష్ బాబు "ఆగడు" సినిమా ఊహించని మలుపు తిప్పింది. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తో బ్రూస్ లీ, వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమాలు పెద్ద మార్పేమీ రాలేదు, ఇక తన స్టైల్ నుండి బయటికొచ్చి తనది కాని కొత్త స్టైల్ లో సినిమా చేసానని అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేసాడు వైట్ల, తీరా చుస్తే అభిమానంతో తనకు ఛాన్స్ ఇచ్చిన రవితేజకు ఉన్న డిజాస్టర్స్ చాలవన్నట్టు ఇంకో డిజాస్టర్ మిగిల్చాడు వైట్ల.

అమర్ అక్బర్ ఆంటోని సినిమా తర్వాత వైట్ల పరిస్థితి మరింత దిగజారి పోయింది, కొత్త స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నా కూడా ఏ హీరో దగ్గరకు కూడా రానివ్వని పరిస్థితి. ఈ క్రమంలో వైట్ల రాసుకున్న స్క్రిప్ట్ కు హీరో దొరికేసాడంటూ ఓ వార్త ఫిలిం నగర్లో లో హల్ చల్ చేస్తోంది. స్టార్ హీరోల కోసం ఎదురు చుస్తే లాభం లేదనుకున్న వైట్ల ఇప్పుడు మంచు విష్ణుని ఆశ్రయించినట్లు తెలుస్తోంది, గతంలో ఈ కాంబినేషన్లో “ఢీ” వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఎలాగూ విష్ణుకి కూడా ఈ మధ్య కలం సరైన హిట్ ఒక్కటి కూడా లేదు, ఢీ లాంటి సూపర్ హిట్ ఇచ్చాడన్న అభిమానంతో వైట్లకు ఓకే చెప్పినట్టున్నాడు విష్ణు. మరి ఫ్లాప్స్ లో కొట్టు మిట్టాడుతున్న ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమాతో గట్టెక్కుతారో లేదో చూడాలి.