11 క్వింటాళ్ల 21 కిలోల గంజాయి స్వాధీనం

SMTV Desk 2019-04-18 20:00:23  ganjaa, police catch huge ganjaa in hyderabad

హైదరాబాద్‌: మహారాష్ట్ర శోలాపూర్‌లోని సీలేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న భారీ మొత్తం గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1,68,22,500 విలువైన 11 క్వింటాళ్ల 21 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు తెలిపారు. దీన్ని పంతంగి టోల్‌గేట్‌ వద్ద పట్టుకొని గంజాయిని తరలిస్తున్న డిసిఎం వాహనాన్ని సీజ్ చేశారు. అలాగే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. నార్కొటిక్ డ్రగ్స్ యాక్టు కింద వీరిపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు.