5 కోట్లు వెనక్కి ఇచ్చేస్తోన్న చరణ్

SMTV Desk 2019-02-07 14:20:26  Mega power star, Ram charan, Dvv Danayya, Boyapati srinu, Vinaya videya rama,

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' ఇటీవల సంక్రాంతి బరిలో నిలిచింది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు, ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేకపోయింది ఈ సినిమా. దాంతో అభిమానుల అంచనాలను అందుకోలేకపోయామని చెప్పేసి చరణ్ ఒక ప్రెస్ నోట్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశాడు. ఈ సినిమా వలన బయ్యర్లు 30 కోట్ల వరకూ నష్టపోయారట. వాళ్ల నష్టాన్ని కొంతవరకైనా తగ్గించవలసిన బాధ్యత తమపై ఉందనే అభిప్రాయాన్ని నిర్మాత దానయ్య దగ్గర చరణ్ చెప్పాడట. దాంతో ఇద్దరూ కలిసి ఓ 15 కోట్లను పరిహారంగా చెల్లిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారని వినికిడి. ఈ సినిమాకి గాను తాను తీసుకున్న పారితోషికంలో నుంచి 5 కోట్లను తిరిగి ఇచ్చేయడానికి చరణ్ సిద్దపడినట్లు సమాచారం. ఇక మిగతా 10 కోట్లను సమకూర్చే విషయంలో దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.