హీరో, డైరెక్టర్ల హ్యాట్రిక్ కాంబోలో రకుల్...?

SMTV Desk 2019-02-07 10:21:18  Rakul Preet Singh, Balakrishna, Boyapati Srinu, Venkimama, Sarainodu, Jaya Janaki Nayaka

హైదరాబాద్, ఫిబ్రవరి 07: రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఆరంభంలో సినీ పరిశ్రమలో మంచి హిట్లు అందుకుంది. తర్వాత క్రమంగా విజయాలకు బ్రేక్ పడి ఆమెకు పరాజయాలు ఎదురయ్యాయి. అంతేకాకుండా యువ కథానాయికల ఎంట్రీతో రకుల్ కి తెలుగులో అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్నిరోజులు తెలుగు సినిమాకి బ్రేక్ ఇచ్చి బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. అక్కడ రెండు మూడు ఆఫర్లను దక్కించుకుంది.

ఇప్పుడు మళ్ళీ ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా రకుల్ బాలకృష్ణతో జోడీ కట్టనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కథానాయికగా రకుల్ నటించబోతుందని సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో 'సరైనోడు', 'జయ జానకి నాయక' సినిమాల్లో నటించింది. ఇక బాలకృష్ణతో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో శ్రీదేవి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆమె వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తున్న 'వెంకిమామ' సినిమాలో నటిస్తుంది.