'పెళ్ళీ గిళ్ళీ జాన్తా నై' అంటున్న ముద్దుగుమ్మ

SMTV Desk 2019-02-09 09:13:34  Sai Pallavi, Fida Actress, Maari2, Rowdy baby, No marriage statement, Dhanush, Suriya, Marriage proposal

సినీ న్యూస్, ఫిబ్రవరి 09: తెలుగులో వచ్చి భారి విజయం అందుకున్న చిత్రం ఫిదా. ఈ చిత్రంలో తెలంగాణ యాస‌తో ప్రేక్ష‌కుల‌ దగ్గర మంచి మార్కులు కొట్టేసి యువతకి కలల రాణిగా కనపడే అందాల భామ సాయి ప‌ల్ల‌వి.
ఈమె స్వతహాగా మ‌ల‌యాళీ, అయిన‌ప్ప‌టికి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఈజీగా క‌నెక్ట్ అయింది. ఇటీవ‌ల ప‌డి ప‌డి లేచే మ‌న‌సు అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇంకా ధనుష్ తో కలిసి నటించిన మారి 2 లో రౌడీ బేబీ పాట యు ట్యూబ్ లో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ప్ర‌స్తుతం సూర్య స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయితే రీసెంట్‌గా ఈ అమ్మ‌డుని ఓ ఇంట‌ర్వ్యూలో మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళా? ప్రేమ వివాహమా? అని ప్రశ్నించగా పెళ్ళీ గిళ్ళీ జాన్తా నై.. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటూ జీవితాంతం పెళ్ళే చేసుకోన‌ని ఖ‌రాఖండీగా చెప్పేసింది. ఈ ముద్దుగుమ్మ చెప్పిన స‌మాధానానికి నెటిజ‌న్స్ బిత్త‌ర‌పోతున్నారు. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం కన్య‌గానే ఉండిపోతావా అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రికొంద‌రు దేవుడు ఆమె మ‌న‌సు మార్చి పెళ్లి చేసుకునేలా చేయాల‌ని కోరుకుంటున్నారు .
ఏదైన సాయిప‌ల్ల‌వి ఇచ్చిన షాక్‌కి నెటిజ‌న్స్ కోలుకోవ‌డానికి కాస్త టైం ప‌ట్టేలా ఉంది.