తండ్రి కొడుకుల కాంబినేషన్ లో మరో సినిమా...!

SMTV Desk 2019-02-07 15:43:12  Puri jagannad, Akaash puri, Mehabooba movie, Ishmart shankar movie, Hero Ram, DIrector anil

హైదరాబాద్, ఫిబ్రవరి 07: టాలీవుడ్ సంచలన దర్శకుడు పూరి జగన్నాద్ తన తనయుడు ఆకాష్ పూరితో గతంలో మెహబూబా అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది కానీ, అనుకున్నన్ని వసూళ్లు తేలేకపోయింది. ప్రస్తుతం పూరి ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఇష్మార్ట్ శంకర్ అనే సినిమా తీస్స్తునాడు. ఇక ఆకాష్ పూరికి మరో కొత్త సినిమా ఖరారైనట్లు తెలుస్తోంది. పూరీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్‌ ఈ సినిమా తెరకెక్కించనున్నారట. ఈ సినిమాతో అనిల్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

అయితే పూరీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగానే కాకుండా ఈ సినిమాకు కథను కూడా పూరీనే అందిస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయట. త్వరలోనే సినిమాను లాంఛనంగా ప్రారంభించి షూటింగ్‌ మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటించేంత వరకూ ఆగాల్సిందే.