పెన్షన్ దారులకు అలెర్ట్...ఈ పని చేయకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం

SMTV Desk 2019-10-31 15:57:15  

పెన్షన్ తీసుకునేవారికి ఓ అలర్ట్. మీరు పెన్షన్ అందుకుంటున్న బ్యాంక్‌కు, పోస్టాఫీస్‌కు ఒక విషయం తెలియజేయాల్సి ఉంది. అదేంటంటే మీరు బ్అరతికున్దేనారన్న విషయం. దీని కోసం మీరు లైఫ్ సర్టిఫికెట్‌ను బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు అందించాలి. నవంబర్ నెలలోనే ఈ పని పూర్తి చేయాలి. మీరు ఒకవేళ పెన్షన్ అందుకుంటున్న ప్రాంతంలో లేకుండా వేరేచోట నివసిస్తూ ఉంటే మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి రావొచ్చు. ఎందుకంటే బ్యాంక్ లేదా పోస్టాఫీస్ మీరు జీవించి ఉన్నరనే విషయాన్ని ధ్రువీకరించుకుంటాయి. పెన్షనర్లు పెన్షన్ తీసుకుంటున్న బ్యాంక్‌కు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్‌ను అందజేయాలి. లేదంటే ఆన్‌లైన్‌లో ఈ పని పూర్తిచేయాలి. పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయాలంటే.. అప్పుడు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీని కోసం వారు జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. జీవన్ ప్రమాణ్ లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను పలు విధాలుగా పొందొచ్చు. సిటిజన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)కు వెళ్లి దీన్ని తీసుకోవచ్చు. అలాగే బ్యాంకులు లేదా పోస్టాపీసులు కూడా వీటిని అందజేస్తాయి. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఉపయోగించాలంటే పెన్షనర్లు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఆధార్ నెంబర్‌ను పెన్షన్ అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి.