మాస్ ఆక్షన్ పై మెగా అల్లుడి కన్ను...

SMTV Desk 2019-02-01 12:02:06  Vijetha movie, Kalyan dev, Chiranjeevi, Puli vasu director, Mass action films

హైదరాబాద్, ఫిబ్రవరి 1: విజేత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా టైటిల్ విజేత ను అల్లుడు సెంటిమెంట్ తో కాపీ చేశాడు కాని ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. తొలి చిత్రంతో హీరోగా నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నమే చేశారన్న విషయం అయితే స్పష్టం అయ్యింది కానీ ఫలితం లేదు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కొడుకు కథగా తెరకెక్కిన ‘విజేత లో కొడుకు కంటే ఎక్కువ మార్కులు తండ్రిగా చేసిన మురళీ శర్మకే పడ్డాయి. కళ్యాణ్ దేవ్ ఇంకా చాలా విషయాల్లో మెరుగుపడాల్సి ఉందంటూ రివ్యూల్ వచ్చాయి.దీంతో ‘విజేత సినిమా కేవలం ఎంట్రీ సినిమాగా చెప్పుకోవటానికే మిగిలింది. దాంతో తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు.

ఈ సారి ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఓ చిత్రం పులివాసు దర్శకత్వంలో మొదలెట్టారు. ఆ సినిమా ఆడినా గుర్తింపు వస్తుంది కానీ మాస్ లోకి వెళ్లటం కష్టం. దాంతో మూడో సినిమాతో అయినా హీరోయిజంతో పాటు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఎలిమెంట్స్‌తో యాక్షన్ కమర్షియల్ మూవీకి మెగా కాంపౌండ్ ప్లాన్ చేస్తోందట. అందుకోసం యంగ్ కమర్షియల్ డైరెక్టర్స్ కథలు వింటున్నట్లు సమాచారం. ఆ మధ్యన గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్‌తో అనుకున్నారు కానీ ఆయన ఇప్పుడు అదే కాంపౌండ్ కు చెందిన వరుణ్ తేజ్ తో వాల్మికి చిత్రం తెరకెక్కిస్తున్నారు. దాంతో కళ్యాణ్ దేవ్ కోసం మాస్ మసాలా ఎంటర్ టైనర్‌ కథను వెతుకుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ లాగ యాక్షన్ సినిమాలతో దూసుకుపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. త్వరలోనే కళ్యాణ్ తేజ్ అప్ కమింగ్ మూవీపై మెగా కాంపౌండ్‌ నుండి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.