కృష్ణంరాజుపై ప్రభాస్ సీరియస్...

SMTV Desk 2019-02-01 11:31:46  Prabhas, Krishnam raju, Saaho

హైదరాబాద్, ఫిబ్రవరి 1: రెబల్ స్టార్ ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కృష్ణంరాజు తరుచూ ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడూ ఎదో వొక అప్ డేట్ ఇస్తూనే ఉంటాడు. తాజాగా కృష్ణం రాజు తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్ళికి సంభందించి ఓ అప్ డేట్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే చాలా సార్లు ప్రభాస్ పెళ్లి గురించి కామెంట్స్ చేశాడు కృష్ణంరాజు. రీసెంట్ గా కూడా సాహో సినిమా పూర్తయిన తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అన్నారు. ఈ విషయాలు ప్రభాస్ కి నచ్చడం లేదట.

తన సినిమాలకు సంబంధించి వార్తల్లో ఉండాలే కానీ ఇలా వ్యక్తిగత విషయాలతో కాదని ప్రభాస్.. కృష్ణంరాజుకి చెప్పినట్లు సమాచారం. ఇకపై మీడియాలో తన పెళ్లి గురించి ఎలాంటి కామెంట్స్ చేయకూడదని చెప్పాడట. ప్రభాస్ తీరు చూస్తుంటే ఇప్పట్లో ఆయనకు పెళ్లి ఆలోచన ఉన్నట్లు కనిపించడం లేదు. సాహో సినిమాతో పాటు దర్శకుడు రాధాకృష్ణ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాడు. సాహో సినిమాను ఈ ఏడాది ఆగస్ట్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.