నేను టీడీపీ మనిషినని పవన్ కు తెలుసు...!

SMTV Desk 2019-01-31 15:42:29  Pawan kalyan, Ali, TDP, Janasena party, Ministry

అమరావతి, జనవరి 31: ప్రముఖ హాస్యనటుడు అలీ టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ తను ఏ పార్టీలోకి వెళ్తారు అన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. అయితే పవన్ అడిగితేనే పార్టీలోకి వెళ్తారా..? అనే ప్రశ్నకు అలీ ఈ విధంగా స్పందించారు పవన్ నా పార్టీలోకి రా అని ఎప్పుడూ పిలవలేదని, ఆయన పార్టీ పెడుతున్న విషయం తనకు ముందే తెలుసునని, కానీ పవన్ ఎప్పుడూ ఆ విషయాలను డిస్కస్ చేయలేదని అన్నారు. పవన్ పార్టీ స్థాపించిన తరువాత ఆయన దగ్గరకి వెళ్లలేదని, ఆయన కూడా తనను పిలవలేదని అలీ క్లారిటీ ఇచ్చాడు.

పవన్ తన సొంత వాళ్లు ఇబ్బంది పడితే చూడలేరని, ఆ కారణంగానే తనను పిలిచి ఉండరని అలీ అన్నాడు. పవన్ ఓ వైపు జగన్, చంద్రబాబులతో పోరాటం చేస్తుంటే మీరు ఆ పార్టీలో కలవడం ఏంటనే ప్రశ్నకు సమాధానంగా అలీ.. నేను టీడీపీ మనిషినని పవన్ కి తెలుసునన్నారు. అప్పుడప్పుడు ఆయన కూడా ఎన్నికలు వస్తున్నాయి కదా.. టికెట్ వస్తుందా అని అడిగేవారని అలీ గుర్తు చేసుకున్నారు. అయినా స్నేహం వేరు, పార్టీ వేరని చెప్పిన అలీ తనకు ఏ పార్టీ మంత్రి పదవి ఇస్తుందో ఆ పార్టీలోకి వెళ్తానని క్లారిటీ ఇచ్చాడు