'మహర్షి' అప్ డేట్...

SMTV Desk 2019-01-30 16:53:42  Mahesh babu, Maharshi, Vamshi paidipalli, Maheshbabu as cricketer

హైదరాబాద్, జనవరి 30: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా మహర్షి . ఈ సినిమాకు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు వివిధ రకాల వేరియేషన్స్ ఉన్న పాత్ర పోషించబోతున్నాడని, అందులో భాగంగా మహేష్ బాబు కాసేపు క్రికెటర్ గా కనిపిస్తాడని వార్తలస్తున్నాయి. బ్యాట్ పట్టుకొని మైదానంలో క్రికెట్ ఆడుతూ కనిపిస్తాడట. దీనికి సంబంధించిన సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

మహేష్ క్రికెట్ ఆడే సన్నివేశాలు తెరపై అభిమానులను మరింత ఖుషీ చేస్తాయని అంటున్నారు. గతంలో వొక్కడు సినిమాలో మహేష్ కబడ్డీ ఆడుతూ కనిపించాడు. ఆ తరువాత క్రీడాకారుడిగా మరే సినిమాలో కనిపించలేదు. మళ్లీ ఇంతకాలానికి మహర్షి లో క్రికెటర్ గా కొంతసేపు కనిపించనున్నాడు. మరి ఈ లుక్ కి సంబంధించిన ఫోటోలు ఏమైనా నిర్మాతలు విడుదల చేస్తారేమో చూడాలి. దిల్ రాజు, అశ్వనీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు!