టాలీవుడ్ లో ది గ్రేట్ 'ఖలీ' ఎంట్రీ...

SMTV Desk 2019-01-30 13:20:05  Jayanth C Paranji, Narendra Movie, The Great Khali, Tollywood entry,

హైదరాబాద్, జనవరి 30: వొకప్పటి సంచలన దర్శకుడు జయంత్ సి పరాన్జీ గత కొన్ని సవంత్సరాలుగా హిట్ లేక సతమతమవుతున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలయిన చిరంజీవి, బాలకృష్ణ , వెంకటేష్, నాగార్జున , పవన్ కళ్యాణ్, మహేష్ బాబు , ప్రభాస్ వంటి నటులతో పనిచేసిన అయన ప్రేమించుకుందాం రా , బావగారు బాగున్నారా , లక్ష్మి నరసింహా వంటి సూపర్ హిట్ సినిమాలు ఖాతాలో ఉన్నాయి. అయితే తాజాగా తెలుగులో 'నరేంద్ర' అనే సినిమా చేస్తున్నాడు. ఇషాన్ ఎంటర్టైమెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో నీలేశ్ ఏటి హీరోగా, ఇజబెల్లె హీరోయిన్ గా నటిస్తున్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో, డబ్ల్యు డబ్ల్యు ఈ స్టార్ ఖలీ వొక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. పలు హాలీవుడ్ చిత్రాలలో నటించిన ఆయన, ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. రామ్ సంపత్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన జయంత్ .. కొత్త వాళ్లతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చేస్తోన్న ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.