విలన్ గా మాస్ మహారాజ....!

SMTV Desk 2019-01-29 17:34:46  Raviteja, Amar akbar anthony, Touch chesi choodu, Nela ticket, Disco raja, VI Anand

హైదరాబాద్, జనవరి 29: మాస్ మహారాజ రవితేజ వరుస ఫ్లోప్ లతో సతమవుతున్నాడు. ఈ మధ్య వచ్చిన "టచ్ చేసి చూడు" "నెల టిక్కెట్" "అమర్ అక్బర్ ఆంటోనీ" వరుసగా ఫ్లోప్స్ కావడంతో అయోమయంలో పడ్డాడు మాస్ మహారాజ. అయితే ఇప్పుడు "డిస్కో రాజా" అనే సినిమాలో నటిస్తున్నాడు. "టైగర్" "ఎక్కడికి పోతావు చిన్న వాడా" ఫేం వి.ఐ ఆనంద్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా రవితేజ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ ఈ సినిమా పై అంచనాల్ని పెంచాయి. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా మొత్తం సైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని అర్ధం అవుతోంది.ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించనున్నాడనే టాక్ నడుస్తోంది. ఈ డ్యూయల్ రోల్ లో కూడా వొక పాత్ర మొత్తం పూర్తి స్థాయి నెగటివ్ షేడ్స్ ని పోలి ఉంటుందట. మరి చాలా కాలం తరువాత నెగటివ్ పాత్రలో నటిస్తున్న రవితేజ.. ఈ క్యారెక్టర్ తో ప్రేక్షకులను మెప్పించడం ఖాయం అని మూవీ యూనిట్ భావిస్తోంది. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.