'ఆర్.ఆర్.ఆర్' లో బాలీవుడ్ అందాల భామ !

SMTV Desk 2019-01-25 18:12:39  SS Rajamouli, NTR, Ram Charan, RRR Movie, pariniti chopra

హైదరాబాద్, జనవరి 25: రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ .. రామ్ చరణ్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్. చిత్రం రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కాగా ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలకు చోటు వున్నట్టుగా సమాచారం. వొక కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా పేరు తెరపైకి వచ్చింది. ఈ చిత్ర యూనిట్ పరిణీతి చోప్రాను సంప్రదించగా, ఆమె భారీ మొత్తంలో పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. తాము అనుకున్న పాత్రకి పరిణీతి అయితేనే బాగుంటుందని భావించిన టీమ్, ఆమె అడిగిన పారితోషికాన్ని ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.