మహర్షి రిలీజ్ డేట్ వాయిదా ??..

SMTV Desk 2019-01-17 13:25:30  Mahesh babu, Maharshi, New movie, release date

హైదరాబాద్, జనవరి 17: ప్రిన్స్ మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా రూపొందుతోంది. మహేశ్ కి ఇది 25వ సినిమా కావడంతో, ఆయన ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ముందే చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ రోజున థియేటర్స్ కి రాదనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని ఏప్రిల్ 26వ తేదీకి మార్చే ఆలోచన చేస్తున్నారని సమాచారం.

అయితే గతంలో మహేశ్ చేసిన పోకిరి .. భరత్ అనే నేను చిత్రాలు ఏప్రిల్ చివరివారంలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ సెంటిమెంట్ కారణంగానే మహర్షి రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 5 నుంచి 26వ తేదీకి మార్చనున్నట్టుగా చెబుతున్నారు. ఏప్రిల్ 5వ తేదీ నాటికి పనులన్నీ పూర్తికాకపోవచ్చని కూడా రిలీజ్ డేట్ ను మార్చనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.