ప్రొడ్యూసర్ అవతారం ఎత్తిన మిర్చి 'కొరటాల ???

SMTV Desk 2019-01-04 16:54:14  Koratala siva, production house, Chiranjeevi

హైదరాబాద్, జనవరి 4: సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ తదుపరి సినిమాను చిరంజీవితో చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సందర్బంగా కొరటాల తన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నిర్మాతగా మారుతున్నారనీ, ఈ ఇద్దరూ కలిసి చిన్న సినిమాలను నిర్మిస్తారనే వార్త వొకటి ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అయితే కొరటాల నిర్మాతగా మారుతున్నారనే వార్తలో నిజం లేదనేది తాజా సమాచారం.

కానీ తన స్నేహితుడు సుధాకర్ నిర్మించే సినిమాలకి సమర్పకుడిగా వ్యవహరిస్తారట. అంతేకాదు తన మిత్రుడు నిర్మించే సినిమాలకి సంబంధించిన కథలను విని, మార్పులు చేర్పులు చేస్తారని అంటున్నారు. అంటే తన స్నేహితుడు నిర్మించే సినిమాలకి సంబంధించిన స్క్రిప్ట్ పై కొరటాల పర్యవేక్షణ ఉంటుందన్న మాట. ప్రస్తుతం కొరటాల .. యువ దర్శకులు చెప్పే కథలను వినడంలో బిజీగా వున్నారని అంటున్నారు.