సుమ, అనసూయ, రష్మిల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

SMTV Desk 2018-12-14 13:17:25  Suma, Anasuya, Rashmi, Remunerations

హైదరాబాద్, డిసెంబర్ 14: యాంకర్స్ గా టాప్ రేసులో దూసుకుపోతున్న సుమ,అనసూయ, రష్మీ తనదైన మాటలు, పంచ్ లతో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటారు. యాంకరింగ్ లో బిజీగా ఉండడంతో వీరుసినిమాలకు దూరంగా ఉంటున్నారు. వీరిలో సుమ టాప్ యాంకర్, ఆమె ఎంత పారితోషికంతీసుకుంటుందో తెలుసా.. వొక ఈవెంట్ కి రెండున్నర నుండి మూడు లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలిసింది. ఇంకా పెద్ద సినిమా ఈవెంట్స్ అయితే ఈ నంబర్ ఇంకాస్త పెరుగుతుందట. సుమ తరువాతి స్థానంలో యాంకర్ అనసూయ, రష్మీ నిలుస్తారు.

వీళ్ళు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా దర్శనమిస్తూ బిజీగా మారారు. జబర్దస్త్ షోలో స్కిన్ షో చేస్తూ యాంకర్లు కూడా హాట్ గా ఉండగలరంటూ నిరూపిస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే అనసూయ వొక్కో ఈవెంట్ కి రూ.2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. రష్మికి వొక్కో ఈవెంట్ కి లక్షన్నర వరకు రెమ్యునరేషన్ దక్కుతుందట.