రాణా ఖాతా లో పౌరాణిక చిత్రం

SMTV Desk 2018-12-12 17:59:35  rana,guna shekar,rudrama devi,telugu cinema,suresh productions,suresh babu

హైదరాబాద్ ,డిసెంబర్ 12 :
దర్శకుడు గుణశేఖర్ రుద్రమదేవి వంటి చారిత్రక చిత్రం తరువాత, హిరణ్యకశిప టైటిల్ తో ఓ పౌరాణిక చిత్రం చేయనున్నట్టు తెలిపారు. ఈ సినిమా సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ ను రానా చేయనున్నాడని అన్నారు. ఇటీవల దీని గురించి సురేశ్ బాబు మాట్లాడుతూ, ఈ సినిమాకి సంబంధించిన పనులు అన్ని విధాలుగా చురుకుగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సినిమా స్క్రిప్ట్ పై హైదరాబాద్ లో చర్చలు నడుస్తూ వచ్చాయి.

గ్రాఫిక్స్ కి సంబంధించి అమెరికాతో పాటు పలు ఇతర దేశాల్లో ప్లానింగ్ సిద్ధమైపోయిందట. అలాగే హైదరాబాద్ లో వేస్తున్న భారీ సెట్స్ కూడా ముగింపు దశకి చేరుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం గుణశేఖర్ , సురేశ్ బాబు ఇద్దరూ మాట్లాడుకుని, జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారంట. సురేశ్ బాబుఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయాలని వున్నట్టుగా తెలుస్తోంది. రానా కెరియర్లోనే కాదు సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కూడా ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని ఆయన భావిస్తున్నారట. గుణశేఖర్ నంది రాలేదని రచక్కెక్కిన గత చిత్రం రుద్రమదేవి బాక్సఆఫీస్ వద్ద అంతగా రాణించ లేదు. ఇంత భారీగా నిర్మితమవుతన్న ఈ చిత్రం ఏమవుద్దో చూడాలి .