అఖిల్ కోసం మెగా పవర్ స్టార్

SMTV Desk 2018-11-26 12:16:08  Mega Power Star Ram charan, akhil akkineni

హైదరాబాద్, నవంబర్ 26: అక్కినేని హీరోగా చేసిన అఖిల్, హలో రెండు సినిమాలు నిరాశ పరచాయి. ప్రస్తుతం అఖిల్ మిస్టర్ మజ్ ను సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా తర్వాత అఖిల్, బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడని తెలుస్తుంది.

రాం చరణ్, బోయపాటి శ్రీను, అఖిల్ ఈ ముగ్గురు కలిసి చేస్తే ఇక ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న వినయ విధేయ రామా సినిమా 2019 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత అఖిల్ తో బోయపాటి శ్రీను మూవీ ఉంటుందని తెలుస్తుంది.

కాంబినేషన్ అదిరింది దానికి తగినట్టుగానే కథ ఉంటే మాత్రం సినిమా అఖిల్ కెరియర్ లో క్రేజీ మూవీగా మారే అవకాశం ఉంది. ఇంకా ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.