చెన్నై సారథి బరిలోకి వస్తాడా..!

SMTV Desk 2018-04-19 18:54:04  dhoni, chennai superkings, ipl, raina,

పుణె, ఏప్రిల్ 19 : ఐపీఎల్-11 సీజన్ ను పునరాగమనంను ఘనంగా చాటిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చాలా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే సొంతగడ్డపై జరగాల్సిన మ్యాచ్ లు పుణెకు తరలిన సంగతి తెలిసిందే. పుణెలో శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ తో తలపడనుంది. కానీ ఇప్పుడు ఆ జట్టు అభిమానులకు ఓ భయం వెంటాడుతుంది. అదేంటంటే..ధోని తదుపరి మ్యాచ్ కు ఉంటాడా...! అని అనుమానం పట్టుకుంది. చెన్నై ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొన్నారు. కానీ, ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ మాత్రం హాజరుకాలేదు. ధోనీ ట్రైనింగ్‌ సెషన్‌కు హాజరుకాలేదంటే అతడు రాజస్థాన్‌ రాయల్స్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన రైనా కోలుకుని ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఆదివారం కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ నడుం నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతూ కనిపించిన విషయం తెలిసిందే. మరి ధోని తర్వాత మ్యాచ్ కు ఉంటాడో..లేదో.. తెలియాలంటే వేచి చూడాల్సిందే.