389 బంతుల్లో వార్న‌ర్ ట్రిపుల్ సెంచ‌రీ

SMTV Desk 2019-11-30 16:27:37  

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ ట్రిపుల్ సెంచ‌రీతో పాకిస్తాన్ బౌలర్లుని ఉతికి ఆరేసాడు. పాకిస్థాన్‌తో అడిలైడ్‌లో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో ప‌రుగుల సునామీ సృష్టించాడు.అయితే టెస్టుల్లో వార్న‌ర్‌కు ఇది తొలి ట్రిపుల్ సెంచ‌రీ కావ‌డం విశేషం. కాగా అడిలైడ్ పిచ్‌పై ఓ ప్లేయ‌ర్ ట్రిపుల్ సెంచ‌రీ చేయ‌డం ఇదే మొద‌టిసారి. గ‌తంలో ఆసీస్ ప్లేయ‌ర్ డాన్ బ్రాడ్‌మ్యాన్ అత్య‌ధికంగా 299 ర‌న్స్ చేశాడు. 389 బంతుల్లో వార్న‌ర్ ట్రిపుల్ సెంచ‌రీ పూర్తి చేశాడు. దాంట్లో 37 బౌండ‌రీలు ఉన్నాయి.