రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు బాడ్ న్యూస్

SMTV Desk 2019-11-20 12:56:59  

వచ్చే నెల ఆరు నుంచి జరిగే విండీస్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ దూరమయ్యాడు. ఈ పర్యటనలో విండీస్‌ మూడు టీ-20లు, మూడు వన్డేలు ఆడనుంది. వన్డే సిరీస్‌లో ఓపెనర్‌ రోహిత్‌శర్మకు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారు. హిట్‌మ్యాన్‌ స్ధానంలో కేఎల్‌ రాహుల్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక మరో ఓపెనర్ ధావన్‌ వైఫల్యంతో గిల్‌, మయాంక్‌లలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. ముంబైలో రేపు సెలక్షన్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విండీస్‌ టూర్‌కు టీమిండియాను సెలక్ట్‌ చేసే ఛాన్స్‌ ఉంది.