టీమిండియా రికార్డుల మోత

SMTV Desk 2019-11-25 11:57:09  

పింక్‌ బాల్‌ టెస్ట్‌లో టీమిండియా రికార్డుల మోత మోగించింది. సిరీస్‌తో పాటు కొన్ని అరుదైన రికార్డులు కోహ్లీ సేన ఖాతాలో చేరాయి. టెస్ట్‌ చరిత్రలోనే వరుస నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలు సాధించిన టీమ్‌గా టీమిండియా సరికొత్త రికార్డును నెలకొల్పింది.బంతి మారినా.. ఫలితం మారలేదు. రెడ్‌ అయినా, పింక్‌ అయినా బాదుడే బాదుడు..! టీమిండియా ముందు ప్రత్యర్థి తేలిపోయింది. ఫలితంగా మరో సిరీస్‌ను వైట్‌ వాష్‌ చేసింది కోహ్లీసేన. సిరీస్‌ విక్టరీతో పాటు అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకుంది.పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 46 పరుగులతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. టీమిండియాకు ఇది వరుసగా నాలుగో ఇన్నింగ్స్ విక్టరీ. ఫలితంగా టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా నయా హిస్టరీ క్రియేట్‌ చేసింది.

మరో వైపు టీమిండియా పేసర్లు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. 19 వికెట్లు తీసిన పేస్‌ గుర్రాలు.. ఉపఖండంలో ఒక మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లగా టీమిండియా పేస్‌ త్రయం నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ఒక వికెట్‌ కూడా పడగొట్టలేదు.ఈ మ్యాచ్‌ విక్టరీతో కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన రికార్డును కైవసం చేసుకున్నాడు. ఆరేళ్లుగా ఎంఎస్‌ ధోని పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ విజయంతో కోహ్లి వరుసగా ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా వరుసగా అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు సాధించాడు. ఎంఎస్‌ ధోని కెప్టెన్‌గా వరుసగా సాధించిన ఆరు టెస్టు విజయాల రికార్డు బ్రేక్‌ అయింది. అదే విధంగా టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా టాప్‌ లేపింది. ఈ విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 360 పాయింట్లకు చేరింది. ఏ ఇతర టీమ్‌ కూడా టీమిండియా దరిదాపుల్లో లేదు. ఆసీస్‌ 116 పాయింట్లతో సెకండ్‌ ప్లేస్‌లో ఉంది