కూతురి రూపంలో దాదాకి కొత్త చిక్కులు!

SMTV Desk 2019-12-19 13:49:38  

కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి కుమార్తె సనా గంగూలీ ప్రముఖ రచయిత కుష్కంత్ సింగ్ రాసిన ‘ది ఎండ్ ఆఫ్ ఇండియా’ నవలలోని సారాంశాన్ని పోస్టు చేసింది. జేఎంఐ విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ఈ పోస్టు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చిన్న వయసులోనే ఎంతో పరిణతితో సనా వ్యవహరించిందని కొందరు ప్రశంసించగా, మరికొందరు వ్యతిరేకించారు. రానురాను ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతుండడంతో గంగూలీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నా కుమార్తె చిన్నపిల్ల. రాజకీయాల గురించి తనకి అంతగా అవగాహన లేదు. ఆ పోస్టు నిజం కాదు. అందువల్ల ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయండి. నాకుమార్తెను వివాదాలకు దూరంగా ఉంచండి… ప్లీజ్’ అంటూ ట్వీట్ చేశారు.