నగదు కష్టాలు రేపటితో తీరుతాయి : ఎస్‌బీఐ ఛైర్మన్‌

SMTV Desk 2018-04-19 15:36:30  cash defict problem, sbi chairman rajneesh kumar, new delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 : గత కొన్ని రోజులుగా నగదు కష్టాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ప్రజలు ఏ బ్యాంక్ కు, ఏటీఎంకు వెళ్ళిన డబ్బులు లేవనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఎస్‌బీఐ బ్యాంకు ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. నగదు కొరతకు సంబంధించిన సమస్య రేపటిలోగా పరిష్కారమవుతుందని చెప్పారు. ఏయే ప్రాంతాల్లో నగదు కొరత అధికంగా ఉందో ఆయా ప్రాంతాలకు డబ్బు రవాణా జరుగుతోందని రేపటిలోగా డబ్బు అందుబాటులోకి వస్తుందని, ఈరోజు సాయంత్రానికి ఆయా రాష్ట్రాలకు చేరుకుంటుందని ఆయన విలేకరులకు వెల్లడించారు. డబ్బు విత్‌డ్రా చేస్తే తిరిగి మళ్లీ ఆ డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్‌ అవుతుంటేనే నగదు రొటేషన్‌ సజావుగా ఉంటుందని ఎస్‌బీఐ చీఫ్‌ రజనీష్‌ అన్నారు. అలా కాకుండా ప్రజలు డిపాజిట్‌ చేయకుండా తమ వద్దే ఉంచుకుంటే.. బ్యాంకులు ఎంత డబ్బు సరఫరా చేసినా సరిపోదని ఆయన వెల్లడించారు.