వారిని ఉరితీసేందుకు నేను రెడీ!

SMTV Desk 2019-12-14 12:04:15  

నిర్భయ దోషుల్ని ఉరి తీసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మీరట్ జైలు తలారి పవన్ జల్లాద్ శుక్రవారం చెప్పారు. వంశపారంపర్యంగా వస్తున్న తలారి వృత్తిలో అతను మూడో తరం మనిషి. ఆనాడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని హత్యచేసిన కరడుగట్టని నేరస్థులు బిల్లా రంగా కాక, ఆ కేసుతో సంబంధమున్న ఇద్దరిని జల్లాద్ తాత ఉరితీశారు. జల్లాద్ తండ్రి కూడా తలారి వృత్తినే చేశారు. ‘జైలు అధికారులు ఆదేశిస్తే ఉరి తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని పవన్ పిటిఐకి ఫోన్‌లో చెప్పారు. నిర్భయ హంతకులు నలుగురిని ఉరితీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (జైళ్లు) ఆనంద్ కుమార్ మాట్లాడుతూ తలారికోసం ఢిల్లీ తీహార్ జైలు నుంచి అభ్యర్థన వచ్చిందని చెప్పారు. ‘ఇద్దరు ఉరితీసే వ్యక్తుల్ని పంపమని తీహార్ జైలు అధికారులు స్వల్ప వ్యవధినిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగారు. ఒక తలారి లక్నోలో అనారోగ్యంతో ఉన్నందువల్ల మీరట్‌లో మరో తలారిని సిద్ధంగా ఉండమని అడిగాఆం’ అని ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. నేరస్థులు ఎవరో తనకు తెలీదని, నిర్భయ కేసు గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో బహుశ ఆ నేరస్థుల కోసమే అయి ఉంటుందని అనుకుంటున్నట్టు 55 ఏళ్ల జల్లాద్ చెప్పారు. అయితే ఆయనకు మీరట్ జైలు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.నిర్భయ కేసులో నేరస్థులు పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముకేష్ సింగ్, వినయ్ శర్మ రెండేళ్ల కిందటే ఉరిశిక్ష విధించారు.