ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం!

SMTV Desk 2019-12-14 12:05:51  

ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం దక్షిణ ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున్న మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజిన్లతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గతవారం అనంజ్ మండిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 43 మంది మరణించగా.. దాదాపు 62 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇలా వరుస అగ్ని ప్రమాదాలతో ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.