కిసాన్ స్కీమ్...అకౌంట్‌లోకి రూ.2,000 వచ్చాయో? లేదో? తెలుసుకోండి

SMTV Desk 2019-12-12 14:49:09  

రైతులకు ఆర్థికంగా చేయూత అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంపీఎం కిసాన్ యోజన స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం గూగుల్‌ను దడదడలాడించింది. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా Google 2019 Year Search report ను విడుదల చేసింది. ఇందులో టాప్ సెర్చ్ అంశాలను వెల్లడించింది. ఇందులో పీఎం కిసాన్ యోజన స్కీమ్ కూడా స్థానం దక్కించుకుంది. 10వ స్థానంలో నిలిచింది. అంటే జనాలు ఏ రేంజ్‌లో ఈ అంశం గురించి సెర్చ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం PM Kisan Samman Nidhi Yojana పథకం కింద అర్హలైన రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 అందజేస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమచేస్తోంది. ఇప్పటికే మూడు విడతల డబ్బు వచ్చేసింది. డిసెంబర్ విడత రావాల్సి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఝలక్ ఇచ్చింది. ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంటేనే కిసాన్ డబ్బులను అందిస్తోంది. అందువల్ల మీరు డిసెంబర్ విడత డబ్బులు పొందాలని భావిస్తే కచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలి.

పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..

*ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
*పోర్టల్ పైన కుడివైపున ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది.
*దీనిపై క్లిక్ చేయాలి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఆధార్ ఫెయిలూర్ రికార్డ్, బెనిఫీషియరీ స్టేటస్, బెనిఫీషియరీ లిస్ట్ అనే నాలుగు ఆప్షన్లు కనినిస్తాయి.
*వీటిల్లో బెనిఫీషియరీ స్టేటస్ ఎంచుకోవాలి. ఇప్పుడు మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది.
*ఇందులో ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ సాయంతో మూడో విడత డబ్బులు వచ్చాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.