పశ్చిమ బెంగాల్‌లో బయటపడ్డ రెండు తలల పాము...వీడియో

SMTV Desk 2019-12-12 14:43:19  

పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లా బెల్దాలో అత్యంత విషపూరితమైన రెండు తలల పాము కనిపించింది. ఈ పామును పరిశీలించిన జూలాజిస్ట్ సోమా చక్రవర్తి మాట్లాడుతూ.. దీన్ని ‘కాలా నాగ్’ (నల్ల త్రాచు) అంటారని తెలిపారు. ఇది చాలా విషపూరితమైనదని, కరిస్తే నాడీ కణాలు దెబ్బతింటాయన్నారు.