గర్భ సమయంలో ఎంత బరువు ఉండాలో తెలుసా?

SMTV Desk 2019-12-19 13:51:57  

గర్భ సమయంలో మహిళలకు ఎక్కువ శ్రద్ధ అవసరం. ఈ టైమ్‌లో పోషకాహారం తీసుకోవడం వల్ల మహిళలు, వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కాబట్టి పోషకాహారం తీసుకుంటుండాలి. ఈ సమయంలో ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. కొంతమంది ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉంటారు. అసలు ఈ టైమ్‌లో ఎంతవరకు వెయిట్ పెరగొచ్చు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..చాలా మంది స్త్రీలలో బరువు గర్భ సమయంలోనే బరువు విషయంలో చాలా తేడాలు ఉంటాయి. చాలా మంది మహిళలు ఈ టైమ్‌లోనే బరువు పెరుగుతుంటారు. విపరీతంగా తగ్గుతుంటారు. అయితే, ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు. నిజానికీ ఎంత బరువు పెరగాలో చెబుతున్నారు నిపుణులు. గర్భంతో ఉన్న మొత్తం సమయంలో మహిళలు 8 నుంచి 10 కిలోల వరకు బరువు పెరగొచ్చు.ఇలా బరువు పెరగడం పుట్టబోయే పిల్లలు, మహిళలకు మంచిది. దీనికంటే తక్కువ బరువు ఉంటే ఆ ప్రభావం స్త్రీలు, పుట్టబోయే పిల్లలపై ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. నెలవారీగా ఎప్పటికప్పుడూ బరువును చెక్ చేసుకుంటూ ఉండాలని చెబుతున్నారు నిపుణులు. వైద్యుల, న్యూట్రిషనిష్టులను సంప్రదించి వారి సూచనల మేరకు ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.గర్భం ధరించిన మొదటి మూడు నెలల్లో మహిళలకు వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పచ్చళ్లు, సూప్స్, పండ్ల రసాలు తీసుకోవాలి. వాంతులు అవుతున్నాయి కదా అని కొంతమంది అసలు ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఇలా చేయడం వల్ల నీరసం, మైకం రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఏదైనా సరే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మొదటి మూడు నెలలు బరువు పెరగకపోవచ్చు. దీనికి వాంతులు అవ్వడం ఓ కారణం అయితే, పిండం సరిగా ఎదగకపోవడం మరో కారణం కావొచ్చు. అయితే ఆ తర్వాత నుంచి కచ్చితంగా బరువు పెంచుకునే ప్రయత్నం చేయాలి. మొత్తం గర్బధారణ సమయంలో 10 నుంచి 12 కిలోల వరకూ బరువు పెరగొచ్చు.. అంతకు మించి మాత్రం బరువు పెరగడం అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.అదే విధంగా కచ్చితమైన డైట్ పాటించాలని చెబుతున్నారు నిపుణులు. పోషకాహారం తీసుకోవాలి. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. చిక్కుళ్లు, బెల్లం, పాలు, బీన్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పాలు, పెరుగు, చీజ్, పన్నీర్ వంటివి కాల్షియం కోసం తీసోకోవాలి. మాంసం, గుడ్లు వంటి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కచ్చితంగా 2 గంటలకు ఓ సారి ఏదైనా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా ఎక్కువగా నీరు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇలా తీసుకోవడం వల్ల ఎలాంటి మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.