అమ్మాయిలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

SMTV Desk 2017-07-04 17:13:57  girls, international,

కోల్ కత్తా, జూలై 4 : అమ్మాయిలను అక్రమంగా విదేశాలకు విక్రయించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికలను అమెరికా, మెక్సికో దేశాలకు తరలిస్తున్నారనే సమాచారంతో దాడి చేసిన పోలీసులు పఠాన్ సాజిద్ ఖాన్ (40), అతని భార్య పర్వీన్ (35), మరో వ్యక్తి అసద్ ఒమర్ (41) అను నిందితులను అరెస్ట్ చేశారు. సాజిద్, పర్విన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల పేరిట పాస్ పోర్ట్ లు తీసుకొని, తమ కుమార్తెలే ప్రయాణిస్తున్నట్లు ఫోర్జరీ ఇమిగ్రేషన్ స్టాంపులు వేయించుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. వారిని విదేశాలకు తరలించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విధంగా గడిచిన సంవత్సర కాలంలో మూడు సార్లు అమ్మాయిలను తరలించారని పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించినట్లు తెలియజేశారు.