ఉపాధ్యాయునిగా మారిన మోదీ

SMTV Desk 2017-07-03 15:44:56  Change, Mindset, 2015, Intended for IAS Officers, drdo, newdelhi, narendramodi

న్యూఢిల్లీ, జూలై 3 : ఎంతటి మనిషికైనా మార్పు సహజం. కానీ మార్పును అడ్డుకునే మైండ్‌సెట్ నుంచి ఐఏఎస్ ఆఫీస‌ర్లు బ‌య‌ట‌ప‌డాల‌ని ప్రధాని న‌రేంద్ర మోదీ అన్నారు. నేడు ఆయ‌న ఢిల్లీలోని డీఆర్‌డీవో భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్యక్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2015 వ సంవత్సరానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్లను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, మార్పును అడ్డుకునే మైండ్‌సెట్‌ను మార్చుకుని, ప‌రిపాల‌నా వ్యవస్థను కొత్త ఉత్తేజంతో నింపాలని వెల్లడించారు. ఈ మేరకు కొత్త భార‌తాన్ని నిర్మించాల‌న్నారు. భార‌తదేశం అనంత‌రం స్వాతంత్ర్యం సాధించిన ఎన్నో దేశాలు అనేక అవ‌రోధాల‌ను ఎదుర్కొన్నాయ‌ని, కానీ ఆ దేశాలు కొత్త ల‌క్ష్యాల‌ను చేరుకున్నాయ‌న్నారు. మార్పు సాధించాలంటే ధైర్యం కావాల‌ని ప్రధాని మోదీ ఐఏఎస్ ఆఫీసర్లను ఉద్దేశించి సమావేశంలో అన్నారు. ప‌రిపాల‌న వ్యవస్థలో ఉన్న లోపాలు త‌మ సామ‌ర్థ్యంతో వాటిని అధిగమించాలని మోదీ వెల్లడించారు.