టాప్‌ 20లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు

SMTV Desk 2018-04-10 13:02:57  Indira Gandhi International Airport (IGIA), New Delhi, busiest airport, ACI

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశ రాజదాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు బ్రేక్‌ చేసింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల టాప్‌ 20 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. ఆరు స్థానాలు పైకి ఎగిసిన ఈ ఎయిర్‌పోర్టు, 2017 జాబితాలో టాప్‌ 20లోకి చేరింది. జీఎంఆర్‌ గ్రూప్‌ నడిపే ఈ విమానాశ్రయం 2016లో 22వ ర్యాంకును సాధించగా.. 2017లో 16వ ర్యాంకును సాధించినట్టు ఎయిర్‌పోర్ట్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌(ఏసీఐ) ప్రకటించింది. ప్రయాణికుల రద్దీలో ఈ ఢిల్లీ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా ఉందని ఏసీఐ తెలిపింది.