1962లోని భారత్ కాదు: అరుణ జైట్లీ

SMTV Desk 2017-07-01 16:52:04  Minister of Arun Jaitley, war of 1962,Border between China and India,In 2017, Doklam,Bhutan

న్యూఢిల్లీ, జూలై 01 : ఇప్పటి భారత దేశం 1962 నాటిది కాదని, అంతకన్నా శక్తిమంతమైనదని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. చైనా, భారత్ మధ్య సరిహద్దుల్లో రోజురోజుకు ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో, 1962 నాటి యుద్ధం నుంచి భారత్ గుణపాఠాలు నేర్చుకోవాలని చైనా చేసిన హెచ్చరికపై ఆయన తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ఒక మీడియా సదస్సులో మాట్లాడుతూ చైనా మనకు గత చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్పేందుకు ప్రయత్నిస్తున్నది. కానీ మనం 1962లో లేము, 2017లో ఉన్నామని చైనా గ్రహించాలి అని ఆయన తెలిపారు. డొక్లాం ప్రాంతంపై చైనా చేస్తున్న వాదన పూర్తిగా తప్పుబట్టారు. తమ భూభాగంలోకి వచ్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నదని భూటాన్ స్పష్టం చేసిందన్నారు. భూటాన్ ప్రకటనతో సరిహద్దులను మార్చివేసేందుకు చైనా ప్రయత్నిస్తున్నదని తేలిపోయిందన్నారు. సరిహద్దుల్లో బలగాల మోహరింపు యాభై ఏళ్లుగా ఇరుదేశాల మధ్య పరస్పర అపనమ్మకానికి కారణమైన యుద్ధాన్ని ఓ సారి గుర్తు చేస్తూ.... 1962 అక్టోబరు 20...... స్నేహానికి తూట్లు పొడిచి, పంచశీల సూత్రాలను సమాధి చేసి భారత్‌పై చైనా దండెత్తిన సమయం... ఈశాన్య భారతంలోని 3225 కిలోమీటర్ల హిమాలయ సరిహద్దులతో పాటు టిబెట్‌ను చైనాలో అంతర్భాగమని వాదిస్తోన్న చైనా పాలకులు ఏకంగా యుద్ధానికి సిద్దమైన రోజులు... 1959 నుంచి చైనాకు వ్యతిరేకంగా టిబెట్‌ మొదలైన ఆందోళనలు, దలైలామాకు భారత్‌ ఆశ్రయమివ్వడం వంటి ఘటనలతో భారత్‌పై చైనా అక్కసు పెంచుకుంది. సరిహద్దుల్లో ఘర్షణలు నిత్యకృత్యంగా మారాయి. సరిహద్దు ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించుకోడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో అల్లర్లు కాస్త చొరబాట్లుగా మారాయి. సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయ్‌చిన్‌ ప్రాంతాల్లో నెలకొన్న వివాదాలు తీవ్రమయ్యాయి. టిబెట్‌ సరిహద్దులపై స్వాతంత్ర్యానికి ముందు నెలకొన్న వివాదాలపై 1914లోనే బ్రిటన్‌, చైనా, టిబెట్ల మధ్య సిమ్లాలో చర్చలు కూడా జరిగాయి. ఈ ఒప్పందానికి భారత్‌ తరపున బ్రిటన్‌, టిబెట్‌లు ఆమోదం తెలిపినా చైనా మాత్రం భారత తూర్పు సరిహద్దుగా నిర్ణయించిన ప్రాంతంపై అభ్యంతరాలతో ఒప్పందానికి నిరాకరించింది. అప్పట్నుంచి తూర్పు సరిహద్దుల్లోని 1,35, 148కి.మీ భూభాగంపై భారత అధికారాల్ని చైనా ప్రశ్నిస్తోంది ఇవి కాస్త ఇరు ప్రాంతాల మధ్య ఘర్షణలుగా మారడంతో 1962లో వివాదాస్పద మెక్‌మోహన్‌ లైన్‌ను దాటుకుని చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సేనలు భారత్‌లో చొరబడ్డాయి. భారత్ 1962 లా కాదని, ఈ మేరకు సరిహద్దుల్లో ఇరు పక్షాలు పరస్పరం మూడు వేల మంది సైనిక బలగాలను మోహరించాయి. సిక్కింలో చైనా రోడ్డు నిర్మాణం ద్వారా సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని భారత్ స్పష్టంచేసింది. మరోవైపు చైనా కూడా కఠినంగా వ్యవహరిస్తున్నది. సిక్కిం వద్ద భారత బలగాలు వైదొలిగితే తప్ప సమస్య పరిష్కారానికి అర్థవంతమైన చర్చలు జరుపలేమని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లు-కంగ్ ముందస్తు షరతు విధించారు. దీనిపై భారత విదేశాంగశాఖ ప్రతిస్పందిస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందానికి కట్టుబడి ఉండాలే తప్ప, ఏకపక్షంగా సరిహద్దుల్లో మార్పులు చేయడం తగదని దీటుగా జవాబిచ్చింది. దీంతో డొక్లాంలో రోడ్డు నిర్మాణ పనులపై చైనా రాయబారికి తీవ్ర నిరసన తెలిపినట్లు జూన్ 20న భూటాన్ బహిరంగంగా ప్రకటించిందని భారత్ విదేశాంగశాఖ తెలిపింది. దీని కారణంగా నాథు-లా మీదుగా మానస సరోవర్ యాత్ర రద్దు సిక్కింలోని నాథు లా పాస్ మీదుగా వెళ్లే కైలాస్ మానస సరోవర్ యాత్ర రద్దయింది. చైనాతో వివాదం నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 400 యాత్రికులు నిరాశకు గురవడంతో దీనికి బదులు ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మీదుగా యాత్రకు అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.