తప్పుడు వార్త రాస్తే జర్నలిస్టు గుర్తింపు రద్దు..

SMTV Desk 2018-04-03 10:43:54  Journalists, Who Spread Fake News, Will Lose Accredations

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: తప్పుడు వార్తలు పుట్టించినా, ప్రచారం చేసిన జర్నలిస్టుల గుర్తింపును రద్దు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విలేకరుల గుర్తింపునకు సంబంధించిన నియమావళిని సవరరించింది. నిబంధనల ప్రకారం.. నకిలీ వార్తలను ప్రచురించడం, ప్రసారం చేసినట్లు నిర్ధారణ అయితే సదరు జర్నలిస్టు గుర్తింపును రద్దు చేస్తారు. తొలి ఉల్లంఘన కింద ఆరు నెలల పాటు, రెండో సారీ అదే పని చేస్తే సంవత్సరం పాటు, మూడోసారీ తప్పు చేస్తే గుర్తింపును శాశ్వతంగా ప్రభుత్వం రద్దు చేయనుంది. ఫేక్‌ న్యూస్‌పై వచ్చే ఫిర్యాదులను పీసీఐ, ఎన్‌బీఏలు పరిశీలించి 15 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ప్రభుత్వం వివరించింది.