ఐన్ స్టీన్ ను మించిన అర్నావ్

SMTV Desk 2017-07-01 13:38:29  iq, arnav sharma, einstein, stifen hokins

లండన్, జూలై 01 : సాధారణంగా మనిషికి జ్ఞాపకశక్తి ఉంటుంది. దానినే ప్రజ్ఞాన సూచీ (ఐక్యూ) అంటుంటాం. అయితే జర్మనీకి చెందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక శాస్త్రాన్ని రెండు స్తంభాల్లో ఒక్కటైనా జనరల్ థియేరీను రీలేటివిటిని అభివృద్ధి చేసారు ఆయన. స్టిఫెన్ హాకింగ్ కనీసం కదలడానికి వీలు లేక, పని చేయని శరీరంతో చక్రాల కుర్చీలో కూర్చొని మాట్లాడని కంప్యూటర్ తో అనేక విజయాలు సాధించారు. ఐన్‌స్టీన్, స్టిఫెన్ హాకింగ్ లకు ఉన్న ఐక్యూ కంటే భారతీయ సంతతికి చెందిన బాలుడు రెండు పాయింట్లు ఎక్కువ సాధించాడు.భారతీయ బాలుడు అర్నావ్ శర్మ 11 సంవత్సరాలకే ఐక్యూలో ఘన విజయం సాధించాడు. ఐన్ స్టీన్, స్టిఫెన్ హాకింగ్ ల సరాసరి ఐక్యూ లెవెల్ 160తో రికార్డులు నమోదు చేసాయి. కానీ ఇప్పుడు వీరి ఐక్యూ రికార్డులను అర్నావ్ శర్మ162 పాయింట్లతో బద్దలుకొట్టారు. రెండున్నర గంటలపాటు జరిగిన ఈ ఐక్యూ లో విజయం సాధించడం ఆనందంగా ఉంది అని అర్నావ్ తెలిపారు.