స్మిత్ పై తొలి వేటు..

SMTV Desk 2018-03-26 20:07:27  steve smith, ipl-11, rajasthan royals, australia

న్యూఢిల్లీ, మార్చి 26 : బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ పై తొలివేటు పడింది. ఓ వైపు క్రికెట్ ఆస్ట్రేలియా కూడా చర్యలు చేపట్టేందుకు ఉపక్రమించింది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్‌కు జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించిన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌పై జీవితకాల నిషేధం విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్ తగిలింది. త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -11వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్సీ నుంచి స్టీవ్‌ స్మిత్‌ను యాజమాన్యం తప్పించింది. నూతన కెప్టెన్‌గా టీమిండియా క్రికెటర్, అజింక్యా రహానేను నియమించింది. అంతే కాకుండా స్టీవ్ స్మిత్ పై ఐసీసీ తీసుకునే చర్యలపై ఆసీస్ ఆటగాడిని ఐపీఎల్ లో ఆడనిస్తారా లేదా అన్నదానిపై రాజస్థాన్ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.