ఆరు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు

SMTV Desk 2018-03-22 19:09:01  Rajya Sabha Elections, 6 states, 25 seats

న్యూఢిల్లీ, మార్చి 23: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో నేడు రాజ్యసభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 25 సీట్ల కోసం యూపీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు పూర్తయిన గంట తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌ మొదలవుతుంది. ఇందులో పదిసీట్లు ఒక్క ఉత్తరప్రదేశ్‌ నుంచే ఉన్నాయి. యూపీలో 10 సీట్లకు ఎన్నికలు జరగనుండగా బీజేపీ 8, ఎస్పీ ఒక స్థానంలో సులభంగా గెలిచేందుకు అవకాశం ఉంది. అయితే పదో స్థానం కోసం బీజేపీ అదనంగా బరిలో దించిన అభ్యర్థికి, బీఎస్పీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నర్సింహారావు బరిలో ఉన్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో 58 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవగా.. నాలుగు రాష్ట్రాల్లోని 33 సీట్లు ఏకగ్రీవం కావటంతో మిగిలిన 25 సీట్లకు శుక్రవారం పోలింగ్ ప్రారంభమైంది.