క్రిస్టియానో రొనాల్డో @ 50..

SMTV Desk 2018-03-20 10:35:48  Cristiano Ronaldo, laliga foot ball tourney, Real Madrid, Girona

మాడ్రిడ్, మార్చి 20 ‌: పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో హ్యాట్రిక్‌ల రికార్డు సాధించాడు. లా లీగా చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్ లో రియల్‌ మాడ్రిడ్‌ 6–3 గోల్స్‌తో గిరోనా క్లబ్‌పై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రియల్‌ మాడ్రిడ్‌ సూపర్‌ స్టార్‌, క్రిస్టియానో రొనాల్డో ఏకంగా నాలుగు గోల్స్‌ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో రొనాల్డో 50 హ్యాట్రిక్స్‌ క్లబ్ లో చేరాడు. ఇందులో 41 సార్లు మూడేసి గోల్స్, ఏడు సార్లు నాలుగు గోల్స్, రెండు సార్లు ఐదు గోల్స్‌ ఉన్నాయి. కేవలం లా లీగాలోనే ఏకంగా 34 సార్లు హ్యాట్రిక్‌ సాధించిన అతను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఐదు సార్లు పోర్చుగల్‌ తరఫున ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యధిక హ్యాట్రిక్‌లు చేసిన రికార్డు బ్రెజిల్‌ దిగ్గజం పీలే (92 హ్యాట్రిక్స్‌) పేరిట ఉంది.