పొద్దు తిరుగుడు పువ్వుతో సెల్ఫీ

SMTV Desk 2017-06-29 16:31:05  sunflower, selfy,

బెంగుళూరు, జూన్ 29 : పర్యాటకుల సెల్ఫీ క్రేజ్ వలన ఒక పంట పండించే రైతు విచిత్ర ఉదంతం అక్కడి బెంగళూరు నగర శివార్లలోని చామరాజానగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రైతు గుండ్లుపేట తాలూకా బేగూర్ గ్రామ వాస్తవ్యుడైన కుమార్ ఇతని వయసు 42 ఈయన గత ఆరు సంవత్సరాలుగా తనకున్న పొద్దుతిరుగుడు తోటను సాగు చేసుకునేవాడు. ఈ పొద్దుతిరుగుడు తోట 766 జాతీయ రహదారిపై ఉంది. అందుచేతనే అటుగా వెళ్ళే పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి సెల్ఫీ లు దిగేవారు. వీరు కేరళ,ఊటి ప్రాంతాలను పర్యటించడానికి వెళ్తూ దారిలో కనిపించే ఈ పొద్దుతిరుగుడు తోట దగ్గర దిగి సెల్ఫీ లు దిగుతూ ఉండటంతో ఈ రైతు తోటకి రావద్దని పంట నాశనమైపోతుందని ఎంత చెప్పిన పర్యాటకులు పట్టించుకునేవారు కాదు. కొందరు ఆ పూలను కోసేవారు.దీనికితోడు సకాలంలో వర్షాలు రాకపోవడంతో పంట దిగుబడిలేక చాలా నష్టపోయాడు.అప్పుడే ఆ రైతుకు ఒక కొత్త ఆలోచన వచ్చింది అదే ఆ పూల తోటలో ఓ వ్యక్తి ఓ సెల్ఫీ దిగాలంటే రూ. 20లు చేల్లిచాలనే రుసుము పెట్టాడు. ఇంకా అదే ఆలోచనను అమలులో పెట్టాడు. ఒక బోర్డును తయారు చేసి దానిపై సెల్ఫీ కి రూ.20 అని బోర్డు పెట్టాడు. డబ్బులు వసులుకై ఒక అబ్బాయిని పెట్టాడు. రానేవచ్చాయి సెలవులు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పూలతో సెల్ఫీ ల వలన రూ. 40వేల ఆదాయం వచ్చిందని చెప్పాడు. భారీ వర్షాల వలన పంట దిగుబడి లేకపోయిన ఈ సెల్ఫీ క్రేజ్ వలన తనకు అప్పుడు రాని ఆదాయం వచిందని చెప్పి సంతోషపడ్డాడు కుమార్.