ఆర్ఆర్ బ్యాటింగ్ కోచ్‌గా స్వదేశీ ఆటగాడు..

SMTV Desk 2018-03-14 12:09:37  rajasthan royals, batting coach,

న్యూఢిల్లీ, మార్చి 14 : రెండేళ్ల నిషేధం తర్వాత రాజస్థాన్‌ రాయల్స్ జట్టు (ఆర్ఆర్) తిరిగి ఈ ఏడాది ఐపీఎల్‌లో పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ జట్టు తమ బ్యాటింగ్ కోచ్‌గా మాజీ క్రికెటర్‌ అమోల్‌ ముజుందార్‌ను ఎంపిక చేసినట్లు ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. ఐపీఎల్‌లో ఇప్పటికే ఫ్రాంఛైజీలు విదేశీ కోచ్‌ల ను నియమిస్తే రాజస్థాన్‌ రాయల్స్‌ మాత్రం స్వదేశీ ఆటగాడినే బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంచుకుంది. ఆర్ఆర్ జట్టు కెప్టెన్‌గా ఆసీస్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌ 7నుండి ఐపీఎల్‌ టోర్నీ ఆరంభం కానుంది.