విపక్షాలకు విందు ఇవ్వనున్న సోనియా..

SMTV Desk 2018-03-13 11:45:30  soniya gandhi, upa chairperson, bjp, rjd

న్యూడిల్లీ, మార్చి13: అధికార భాజపాకి వ్యతిరేకంగా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ మంగళవారం రాత్రి విందుకు ఆహ్వానిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొని, అధికార భాజపాని నిలువరించడానికి బలమైన విపక్ష కూటమి అవసరమనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆర్జేడీ, వామపక్షాలతో పాటు మునుపటి యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నింటినీ సోనియా ఆహ్వానించారు. పలు కార్యక్రమాల కారణంగా తాను ఈ భేటీకి హాజరుకాలేనని తృణమూల్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కాంగ్రెస్‌ వర్గాలకు సమాచారం ఇచ్చారు. ఆ పార్టీ తరఫున సుదీప్‌ బందోపాధ్యాయ హాజరవుతారు. డీఎంకే తరఫున కణిమొళి రానున్నారు. ఆర్జేడీ నుంచి లాలూప్రసాద్‌ తనయుడు తేజస్వీ యాదవ్‌ హాజరవుతారు.