మోదీకి హిందీ లో ట్విట్ చేసిన డచ్ ప్రధాని

SMTV Desk 2017-06-28 16:04:25  narendra modi, india, twit, dach, pm

డిల్లీ, జూన్ 28 : ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం మూడు దేశాల పర్యటనను పూర్తి చేసుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఆ మూడు దేశాలు పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్ అని అందరికి తెలిసిన విషయమే. భారత్-డచ్ ల మధ్య ఉన్న సంబంధాలు ఈ ఏడాదితో 70 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాయి. ఈ విషయంగా ప్రధాని మంత్రి మోదీ తన పర్యటనను డచ్ బాషలో పలుమార్లు ట్విట్ చేశారు. దీనికి సమాధానంగా నెదర్లాండ్ ప్రధాని మార్కరుట్టే హిందీలో ట్విట్ చేసి అందరిని అబ్బురపరిచారు. అయితే రుట్టే చేసిన హిందీ ట్విట్ లో పదాల మధ్య గ్యాప్ ఇవ్వకపోవడంతో నెటిజన్లు అయోమయం లో పడ్డారు."నరేంద్ర మోదీకి స్వాగతం అంటూ మన ఇరు దేశాల సంబంధాలకు 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. మన ఈ సమావేశం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది." అని రుట్టే తన సందేశాన్ని హిందీలో ట్విట్ చేశారు. అయితే ఈ ట్విట్ చదవడానికి తమకు చాలా కష్టంగా ఉందని, ఎక్కడా గ్యాప్ లు లేకుండా రాసారని నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఈ ట్విట్ ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న గ్యాప్ లను తొలగించాలనే రుట్టే ఇలా ట్విట్ చేసి ఉంటారని ఇది ఒక మంచి ప్రయత్నం అంటూ అందరూ కామెంట్స్ చేశారు.