"ఆధార్‌" తప్పనిసరి కాదు..

SMTV Desk 2018-03-07 17:53:31  NEET exam, adhar card, supreme court.

న్యూఢిల్లీ, మార్చి 7 : నీట్ పరీక్షకు “ఆధార్” తప్పనిసరి అని చెప్పడంతో ఆధార్ ఇంకా రాని విద్యార్థులు ఆందోళన చెందారు. దీనికి స్పందించిన సుప్రీం కోర్టు.. నీట్‌తో సహా నేషనల్ లెవల్ పరీక్షలన్నిటిలోనూ ఆధార్‌ తప్పని సరికాదని ఉత్తర్వులు జారీ చేసింది. వోటర్‌ ఐడీ, బ్యాంక్‌ ఖాతా, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, రేషన్‌ కార్డు వంటివి కూడా గుర్తింపు కార్డులుగా చూపించవచ్చని పేర్కొంది. ఈ విషయంపై అటార్ని జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్‌, మేఘాలయా, అసోంలో వలే ఐడీ ప్రూఫ్‌లు చూపించి కూడా పరీక్షలు రాయవచ్చని తెలిపారు. దీంతో సుప్రీం నీట్‌కు ఆధార్‌ తప్పని సరికాదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.