ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో "తలైవా"..

SMTV Desk 2018-03-07 12:36:33  RAJINIKANTH, FACEBOOK, INSTAGRAM, FOLLOWERS, CHENNAI.

చెన్నై, మార్చి 7 : సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ మాటల్లో వర్ణించలేం. సోషల్ మీడియాలో ఆయనను అనుసరిస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంది. ఇప్పటివరకు రజనీకి ట్విటర్‌లో 4.58 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ట్వీట్లు చేయడం తక్కువే అయినా ఆయనను అనుసరించే వారు మాత్రం మిలియన్లలో ఉన్నారు. తాజాగా తలైవా.. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలను తెరిచారు. ఆయన అలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచారో లేదో.. 2,196 మంది ఫాలోవర్లతో వెరిఫైడ్‌ ఖాతా వచ్చింది. అందులో ఆయన తొలి పోస్ట్‌గా "కబాలి" చిత్రంలోని ఫోటోతో పాటుగా "వణక్కం" అంటూ పోస్ట్‌ చేశారు. అలాగే ఫేస్‌బుక్‌లో రెండు ఫోటోలను పోస్ట్ చేశారు. ఒకవైపు రాజకీయం, మరోవైపు సినిమాలతో రజనీ తీరిక లేకుండా గడుపుతున్నారు. త్వరలోనే "కాలా", "2.ఓ" అనే చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.