2017 మిస్ ఇండియా

SMTV Desk 2017-06-26 17:09:45  miss india, manusha chillar, ranber kapoor, karan johar

ముంబై, జూన్ 26 : 54 ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలు ఆదివారం రాత్రి ముంబై లో జరిగాయి. యష్ రాజ్ స్టూడియో లో జరిగిన ఈ పోటిలో హర్యానకు చెందిన మానుషి ఛిల్లర్ మిస్ ఇండియా గా నిలిచారు. ముంబైలో జరిగిన వేడుకలో 2016 మిస్ స్టిఫానీ డెల్ వాలే న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. పలు రాష్ట్రాలకు చెందిన అందమైన భామలు పోటిపడ్డారు. ఇందులో మొట్టమొదటి సారి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి విజేతలుగా నిలిచారు. బాలీవుడ్ నటులు రణ్ బీర్ కపూర్, కరణ్ జోహార్ లు పాల్గొని విన్నర్ ని ఎంపిక చేసారు. ఇందులో మిస్ ఇండియా గా హర్యానకు చెందిన మానుషి ఛిల్లర్ నిలిచారు. మొదటి రన్నర్ గా జమ్ముకాశ్మీర్ కు చెందిన సనా దువా, రెండో రన్నర్ గా గుజరాత్ కు చెందిన ప్రియాంక కుమారి నిలిచారు. మానుషి తల్లిదండ్రులు ఇద్దరు వైద్యులు కావడం వలన ఆమె కూడా వైద్య విద్య సోనిపట్ లోని భగవత్ పూల్ సింగ్ గవర్నమెంట్ కాలేజిలో సీటు సొంతం చేసుకుంది.