కెనడా ప్రధానితో మోదీ..

SMTV Desk 2018-02-23 14:13:00  KENADA PRIME MINISTER, JUSTICE KRODO, PRIME MINISTER MODHEE.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 : కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.. వారం రోజుల పర్యటన నిమిత్తం కుటుంబసమేతంగా భారత్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వారిని కలిశారు. ఈ ఉదయం ట్రూడో కుటుంబానికి రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. మొదట మోదీ ట్రూడోతో కరచాలనం చేసి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ట్రూడో సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొని కెనెడాలో సిక్కు ఉగ్రవాదం గురించి, ఉగ్రవాద నిర్మూలనలో పరస్పర సహకారంపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా వాణిజ్యం, రక్షణ, పౌర అణు సహకారం, అంతరిక్షం, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపైన చర్చించనున్నారు.