మాండరిన్ ను అధికార భాషగా గుర్తించిన పాక్..

SMTV Desk 2018-02-20 14:14:10  pakistan, China Mandarin, official language, don paper

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: భారత్ శత్రు దేశాలైన చైనా, పాక్ ల మధ్య సత్సంబంధాలు ఉన్న విషయం జగద్వితమే. కాగా ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య బంధం బలపడుతుందని మరోసారి రుజవైంది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే, చైనా అధికార భాష అయిన మాండరీన్‌కు పాక్‌ తమ దేశంలో అధికారిక హోదా ఇచ్చింది. మాండరీన్‌ భాషను అధికారిక భాషగా గుర్తించేందుకు పాకిస్థాన్‌ సెనేట్‌ అంగీకారం తెలిపింది. పాకిస్థాన్‌లో 44శాతం మంది మాతృభాష పంజాబీ, 15.32శాతం మంది మాతృభాష పాష్తో, 14.5 శాతం ప్రజలు సింధి, 4శాతం మంది ప్రజలు బలోచి మాట్లాడుతారు. అయినప్పటికీ.. వీటిని కాదని చైనాకు చెందిన మాండరీన్‌ను అధికారిక భాషగా గుర్తించడంపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.